ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మార్ట్ సిటీతో మెరుగైన జీవనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 07:12 PM

విశాఖపట్నంలో స్మార్ట్ సిటీ పనులను త్వరితగతిన పూర్తిచేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్య కరమైన జీవనాన్ని అందించే దిశగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కృషి చేస్తోందని జీవిఎంసీ కమిషనర్, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సి. ఐ. పి. పి. రాజబాబు తెలిపారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అసెట్స్ మేనేజ్మెంట్ తో వారితో కలిసి జివిఎంసి కమిషనర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై జీవీఎంసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా విశాఖ పట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై సి. ఇ. ఒ. కు స్మార్ట్ సిటీ అధికారులు పవర్ పాయింట్ ప్రెజం టేషన్ ద్వారా వివరించారు. 


ఈ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో, స్మార్ట్ సిటీ పనులలో ఎబిడి మరియు సిటీ ఏరియాలో ప్రాజెక్టు పనులు ఏ ఏ దశలో ఉన్నాయని, సీవేజ్ నట్వర్కు వ్యవస్థ పనులైన ప్యాకేజీ-1 ఎందుర్తి, ప్యాకేజీ-2 లో గాజువాక, మల్కాపురం పనుల వివరాలను వివరించారు. సిటీస్ ప్రాజెక్టు కింద 40 జివిఎంసి స్కూళ్లను నాడు - నేడు. తరహాలో అభివృద్ధి చేయుచున్నామని తెలియజేశారు. 


అనంతరం, స్మార్ట్ సిటీ సి. ఇ. ఓ. పి రాజాబాబు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా సీవరజ్ నెట్వర్క్ వ్యవస్థ పనులలో ప్యాకేజ్ 1 మరియు 2 యొక్క పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయుటకు కావలిసిన నిధులను జివిఎంసి మరియు జివిఎస్ సిసిఎల్ సంయుక్తంగా సమకూరుస్తుంది అని తెలిపారు. అందుకు సంబంధించిన నిధులు మరియు కావలిసిన సహకారం స్మార్ట్ సిటీ అందిస్తుందని, రాబోయే ప్రతిపాదిత టెండర్లలో కూడా కాంట్రాక్టర్లు పాల్గొనెలా చూడాలని సి. ఇ. ఒ. తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఎపియుఐఎఎంఎల్ సి. ఇ. ఒ. నారాయణ రెడ్డి, సిటీఒ శ్రీనివాస్, రీజనల్ హెడ్ సత్య నారాయణ, జివిఎంసి పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com