మూడు రాజధానులను వ్యతిరేకించడం ద్వారా ఉత్తరాంధ్రను దోచుకునే కుట్ర సాగుతోందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలందరి ఆమోదం లేని అమరావతిని టీడీపీ రాజధాని చేసిందన్నారు. మెట్రోపాలిటన్ సిటీ అయిన విశాఖకు రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విశాఖలో రాజధాని వద్దని ఇక్కడకు వచ్చి నిరసనలు చేస్తే తాము సహించాలా అని ప్రశ్నించారు.