10 ఏళ్ల క్రిందట ఆధార్ నమోదు చేసుకున్నట్లైతే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సూచించింది. దీనిపై బుధవారం యూఐడీఏఐ ప్రకటన చేసింది. 10 ఏళ్లకోసారి ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని పేర్కొంది. అప్‌డేట్ చేయించుకునేందుకు దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, చిరునామా, ఫొటో, బయోమెట్రిక్ వంటివి అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది.