ప్రతి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఈ నెల31 నాటికి పూర్తి కావాలని అసెంబ్లీ సెగ్మెంట్ స్పెషల్ ఆఫీసర్ రాంమోహన్ ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు స్థానిక ఎన్జీవో హోంలో నియోజకవర్గ నూతన బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈసభలో ఆయన మాట్లాడుతూ మార్పులు, చేర్పులు, కొత్తగా అర్హులుంటే ఓటరుగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో ప్రొద్దుటూరు డిప్యూటీ తహసీల్దారు మనోహర్ రెడ్డి, రాజుపాళెం తహసీల్దారు ఇందిరరాణి, తదితరులు పాల్గొన్నారు.