వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేవరకు ప్రతి నాయకుడు, కార్యకర్త పోరాటం చేయాలని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మండలంలోని రేగడిపల్లె, కె. వెంకటాపురం, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన గ్రామంలోని ప్రతి ఇంటికి వెల్లి ప్రభుత్వ అసమర్థత వల్ల అభివృద్ధి ఆటకెక్కిందన్నారు. 2023 పశ్చిమ రాయలసీమ పట్టభధ్రుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రమణారెడ్డి, గండ్లూరు నాగేశ్వర రెడ్డి, కొట్టాలపల్లె అరుణ్ కుమార్రెడ్డి, చామళ పద్మజ, నరసింహారెడ్డి పాల్గొన్నారు.