ఎలాంటి షరతులు వంట గ్యాస్ వినియోగంపై విధించవద్దని డిస్టిక్ విజిలెన్సు మానిటరింగ్ కమిటీ సభ్యులు పైడిపల్లి కిశోర్ కోరారు. ఈ సందర్భంగా పులివెందులలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి మూడు మాత్రమే వంట గ్యాస్ సిలెండర్లు అందజేస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పడం సరికాదన్నారు. ప్రతి రెండు నెలలకు ఒక సిలిండర్ చొప్పున వేసుకున్నా ఏడాదికి ఆరు సిలిండర్ల వంట గ్యాస్ ఖర్చు అవుతుందన్నారు. గత రెండు దశాబ్దాల కాలంగా ప్రతి పేద కుంటుంబ కట్టెల పొయ్యికి స్వస్తి పలికి వంట గ్యాస్ కు అలవాటుపడ్డారన్నారు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలెండరు ధర విపరీతంగా పెరిగినా పేదలు ఎలాగో ఓర్పు సహనంతో భరిస్తున్నారన్నారు. గ్యాస్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు.
పెరిగిన ధరలు తగ్గించాలంటూ విపక్ష పార్టీలు వివిధ రూపాలల్లో నిరసనలు తెలిపినా కేంద్రం ఒకింక ఆలకించలేదన్నారు. కానీ ఇప్పుడు ఏడాదికి మూడు సిలెండర్లు మాత్రమే ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పడంతో పేదలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల పరిణామాల నేపధ్యంలో వీలైనంత వరకు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, అలాగే వంట గ్యాస్ వినియోగంపై ఎలాంటి షరతులు, నిబంధనలు విధించవద్దని ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మధ్యతర గతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.