వైఎస్ఆర్ భీమా పేరుతో ప్రజలను మభ్య పెడుతూ, మోసం చేస్తున్న ముఠాలోని సభ్యుడుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బూరాజన్ తెలిపారు. బుధవారం కడప నగరంలో విలేకరుల సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు. కోవిడ్ 19 బారిన పడి మృతి చెందిన కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు. కోవిడ్ లో మృతి చెందిన మృతుల వివరాలు సేకరించి, మృతుల కుటుంబాలకు మోసపు పూరిత మాటలు చెప్పి ఫోన్ పే ద్వారా లక్షల రూపాయలు కాజేస్తున్న ముఠా సభ్యులోని ఖాజీపేట కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 9 బ్యాంకు అకౌంట్ లలో రూ. 7లక్షల 34 వేల 964 సిజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలు పథకాల వివరాలు తెలుసుకోవాలంటే తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో తెలుసుకోవాలని, ఎవరు కూడా నమ్మి మోసపోవద్దు అన్నారు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఆశ్రయించాలి అన్నారు. అడిషనల్ ఎస్పీ తుషార్ దుడి, వన్ టౌన్ సిఐ నాగరాజు, సైబర్ క్రైమ్ సీఐ శ్రీదర్ నాయుడు, ఎస్సైలు ఒబన్న, నారాయణ, మధు మల్లేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.