గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం రైల్వే కోడూరు మండలం గంగరాజు పోడు సచివాలయ పరిధిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల నుంచి వస్తున్న వినతులను, సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో పరిష్కార దశగా చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమనవర్మ, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఎంపీడీవో నాగార్జున, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.