విద్య కోసం వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం వారి అభివృద్ధి పురోగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల అభ్యున్నతి కోసం వారి పిల్లల కోసం విద్యకు ఎంతో ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాల విద్యార్థుల కోసం వసతి గృహాలుకు నిధులు మంజూరు చేసి భవనాలు నిర్మించడం ముఖ్యమంత్రి ముందుచూపుకు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొందూరు జడ్పిటిసి ఎల్ కాంతారావు ఎంపీపీ కే ఉషారాణి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గోన్నారు.