ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రశంసించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ బుధవారం తాడేపల్లి వచ్చిన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ జగన్‌ను జెన్నిఫర్ అభినందించారు. అంతేకాకుండా జీడీపీ వృద్ధిలో నెంబర్ వన్‌గా ఏపీని నిలబెట్టారని కూడా ఆమె జగన్‌కు కితాబిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించాలని ఈ సందర్భంగా జెన్నిఫర్‌ను జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అమెరికా రాయబార కార్యాలయం చీఫ్‌గా ఇటీవలే జెన్నిఫర్ నియమితులయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలకు సంబంధించిన అమెరికా వ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలోనే ఆమె జగన్‌తో పరిచయం కోసం ఆయనతో భేటీ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa