కర్ణాటకలో దుమారం రేపిన హిజాబ్ వ్యవహారం పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరు జడ్జిలు వేర్వేరు తీర్పులిచ్చారు. కన్నడ హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్దించగా, జస్టిస్ సుధాన్షు దులియా దీనిని తోసిపుచ్చారు. దీంతో కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. హిజాబ్ ను కన్నడ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. కన్నడ హైకోర్టు కూడా హిజాబ్ ను నిషేధిస్తూ తీర్పునివ్వగా సుప్రీంలో పిటిషన్ నమోదైంది.