అనంతపురంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నిర్వాసితులకు అండగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2 వేల సాయం అందించాలని ఆదేశించారు. బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ప్రతి బాధిత కుటుంబానికి అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనాలు తయారు చేసి పరిహారం అందజేయాలన్నారు.