టీమిండియా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉందని, ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకుంటే ఈసారి టీ20 ప్రపంచకప్ గెలుస్తామని మాజీ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పారు. నిజానికి బ్యాటింగ్ బాగానే ఉంది కానీ కొంతకాలంగా ఫీల్డింగ్ సరిగా లేదు. ఆసియాకప్‌లోనూ కీలక మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు జారవిడుచుకుని మ్యాచ్‌లను కోల్పోయింది.
దీనిపై శాస్త్రి స్పందించారు. "గత ఏడేళ్లుగా కోచ్‌గా ఉన్న నేను ఇప్పుడు ఈ జట్టును బయటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు మనకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. యువత లేదా అనుభవజ్ఞులు కావచ్చు.. కొన్నిసార్లు వారు ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా ఆడుతున్నారు. "టీ20 క్రికెట్‌లో భారత్‌కు ఇప్పుడు అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ముఖ్యంగా ఐదో నంబర్‌లో ఉన్న హార్దిక్, ఆరో నంబర్‌లో కార్తీక్ లేదా పంత్ చాలా ప్రభావం చూపుతారు. అయితే వారు ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలి అని శాస్త్రి స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌లో 15-20 పరుగులు ఆపగలిగితే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉంటుందని, లేకపోతే బ్యాట్స్‌మెన్ ప్రతిసారీ ఆ పరుగులు చేయాల్సి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. ఫీల్డింగ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి జట్లు చేసేది ఇదేనని అన్నాడు.
రవిశాస్త్రి మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌లకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావచ్చు, ఆ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతారని అనడం గమనార్హం. ఈ వరల్డ్‌కప్ తర్వాత ఇండియా కొత్త టీమ్‌ను చూస్తుందని నేను అనుకుంటున్నాను. 2007లో జరిగినట్లే ఇప్పుడూ జరగొచ్చు. అప్పుడు సచిన్, ద్రవిడ్, గంగూలీ లేకుండా టీ20 టీమ్ ఏర్పడింది. ధోనీ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడూ అదే జరుగుతుంది. కోహ్లి, రోహిత్ బాగా ఆడలేరని కాదు కానీ వాళ్లు ఇతర రెండు ఫార్మాట్లకు కావాలి. ముఖ్యంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. అందువల్ల వాళ్లపై భారం మోపకూడదు" అని రవిశాస్త్రి చెప్పాడు.