ఏపీలో మ్యారేజ్ సర్టిఫికెట్లను ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేయనున్నారు. సర్టిఫికేట్ కోసం గ్రామ, వార్డు సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు. పెళ్లైన తరువాత గ్రామాల్లో 60 రోజుల్లోపు, పట్టణాల్లో 90 రోజుల్లోపు పెళ్లి జరిగిన ప్రాంతానికి సంబంధించిన సచివాలయంలో అప్లై చేసుకోవాలి. గడువు తర్వాత సర్టిఫికెట్ అవసరమైన వారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి.