శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో బుధవారం ఓ వింత శిశువు జన్మించింది. మెళియాపుట్టి మండలం పోడూరు గ్రామానికి చెందిన మహిళ బుధవారం ప్రసవించింది. పుట్టిన శిశువుకు 2 మూతులు, 4 చెవులు, పెద్ద తల ఉన్నాయి. ఈ విషయమై ఆసుపత్రి ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పార్వతి మాట్లాడుతూ శిశువు బతికే ఉందని తెలిపారు. హర్మోన్ల ప్రభావం కారణంగా శిశువులు ఇలా జన్మిస్తారని తెలిపారు.