ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో కొర్రమీను చేప సీడ్ విక్రయం లాభసాటిగా మారింది. రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేస్తున్నారు. సీడ్ దశలోనే మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. సీడ్ ను మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఇంటి పెరట్లో పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు.