భర్త మరో యువతితో తిరుగుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది. మోనిక(20), భార్గవ్ దంపతులకు 8 నెలల కిందట పెళ్లి జరిగింది. దసరా పండుగకు భార్గవ్ తన భార్యను పుట్టింటికి పంపించాడు. తరువాత మళ్లీ తీసుకెళ్లడానికి రాలేదు. మరో యువతితో తీసుకున్న ఫోటోలను బుధవారం భార్యకు పంపాడు. ఆ ఫోటోలు చూసిన మోనిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్తే కారణమని డెత్ నోట్ రాసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa