రేణిగుంట-గుంతకల్లు-రేణిగుంట మధ్య నడుస్తున్న ప్యాసింజరు రైలును తిరుపతి-హుబ్లీ-తిరుపతి (07657/07658) వరకు నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. తిరుపతి-హుబ్లీ రైలు ఈనెల 17 నుంచి, హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్లే రైలు ఈనెల 18 నుంచి నడపనున్నారు. కరోనా కారణంగా ఈ రైలు 13 నెలలు పట్టాలెక్కలేదు. తిరుపతి హుబ్లీల మధ్య నడిచే ఈ రైలును డెమో ఎక్స్ ప్రెస్ గా పేరు మార్చి రేణిగుంట-గుంతకల్లు వరకు నడిపేవారు.