టేకాఫ్ అవుతుండగా విమానం చక్రం ఊడిపడిపోయిన ఘటన ఇటలీలో జరిగింది. బోయింగ్ కంపెనీకి చెందిన బోయింగ్ 747 డ్రీమ్ లిఫ్టర్ దాని ప్రధాన చక్రాలలో ఒకదాన్ని కోల్పోయింది. మంగళవారం ఉదయం దక్షిణ ఇటలీలోని టరాంటో నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే జెయింట్ బోయింగ్ కో-కార్గో జెట్ నుండి ఒక టైర్ ఊడిపోయి నేలపై పడింది. అయితే ఆ విమానం టైర్ ఊడిపోయిన తర్వాత చార్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని బోయింగ్ కంపెనీ తెలిపింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది.