ఏపీలో అక్టోబర్ 15 రాజకీయ వేడిని పుట్టిస్తోంది. ఆ రోజున వికేంద్రీకరణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ విశాఖ గర్జన నిర్వహిస్తోంది. దీనికి వైసీపీ మద్దతునిస్తూ 50 వేల మందితో ర్యాలీకి సన్నాహాలు చేస్తోంది. అదే రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రభుత్వం వైఫల్యాలపై టీడీపీ సమావేశం నిర్వహించనుంది. టీడీపీ ముఖ్య నాయకత్వం విశాఖ తీరానికి రానుంది. అదే రోజున పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తున్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.