విశాఖను డ్రగ్స్ మూలాలు వీడడం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట ఎల్ఎస్ఓ బ్లాట్స్ దొరుకుతూనే ఉన్నాయి. విశాఖ సిటీ పోలిష్ కమిషనర్ శ్రీకాంత్ ఏ డి సి బి ఆనంద్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ఏసీపీ టాస్క్ ఫోర్స్ త్రినాధరావు సూచనలు మేరకు యాంటీ నార్కోటిక్ సెల్ ఎస్సై శంకర్రావు వారి సిబ్బంది సహకారంతో బుధవారం దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తాజాగా గోపాలపట్నం పరిధిలో చంద్రానగర్లో దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3.5 ఎల్ఎస్ఓ బ్లాట్లతో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో గోపాలపట్నంకి చెందిన మహేష్ అనే యువకుడు, ఎంవీపీ కాలనీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. ముగ్గురు నిందితుల్ని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.