విశాఖపట్నం, అచ్యుతాపురం: మండలం కొత్త మోసయ్యపేటకు చెందిన బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పంచదార్ల అప్పలరాజు కుమారుడు సింహాద్రి (8) బుధవారం ఆడుకునేందుకు ఇంటి మేడ పైకి వెళ్ళాడు. మెడపై పడి ఉన్న సర్వీస్ వైరు బాలుడి కాళ్లకు తగలడంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.