మిరియాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను మిరియాలు తగ్గిస్తాయి. నల్లమిరియాలు వాడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల నుంచి మిరియాల టీ బయటపడేస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మిరియాలు బాగా తోడ్పడుతాయి. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి మిరియాలు ఉపశమనం కలిగేలా చేస్తాయి.