ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. పరీక్షల్లో కాపీ కొడుతుందనే అనుమానంతో 9వ తరగతి విద్యార్థినిని టీచర్ శుక్రవారం బట్టలు విప్పించింది. తనిఖీ చేయగా, ఆమె వద్ద ఎలాంటి స్లిప్స్ దొరకలేదు. దీంతో ఇంటికెళ్ళిన తర్వాత మనస్తాపంతో నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. టీచర్ వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందిన బాలిక పేరెంట్స్ పేర్కొన్నారు.