సిల్హెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం 1 గంటకు భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఆసియా కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. థాయ్‌లాండ్‌పై సెమీఫైనల్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. మరో సెమీస్‌లో పాక్‌పై ఒక్క పరుగు తేడాతో శ్రీలంక విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. దీంతో హాట్ ఫేవరెట్‌గా భారత్ బరిలోకి దిగుతోంది.