అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలన్ని నీట మునిగాయి. వర్షం నీరు నిలబడడంతో పంటలు దెబ్బతిని నష్టం వాటిల్లిందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రావతి సమీపంలో పీకిన వేరుశెనగ పంట తొలగించి ఇంటికి తరలించే లోపే భారీ వర్షానికి తడిసిపోతూ మొలకలు వస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాయంపల్లి వద్ద వాగు రావడంతో వరిమడులు నీట మునిగిపోయాయని రైతులు వాపోతున్నారు.