హిందూపురం మండలం జీవామాకులపల్లికి చెందిన శివరాజ్ రెండో కుమారుడు హరీష్(24) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లేపాక్షి ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపిన వివరాల మేరకు గ్రామంలో చిల్లరకొట్టుతోపాటు కబాబ్ బండి వేసుకుని జీవనం సాగిస్తుండేవాడని శుక్రవారం గ్రామానికి దూరంలో ఉన్న పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. దీనిపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తామన్నారు.