అనంతపురం జిల్లా కూడేరు మండలం పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు వరద ప్రవాహం కొనసాగుతుంది. పేరూరు జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల మేర వరదనీరు పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు వస్తుండగా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6 గేట్లు ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని ఆధికారులు దిగువకు విడుదల చేశారు. పెన్నహోబిలం సమీపంలోని ఏట్టి గంగమ్మ ఆలయంలోకి వరదనీరు చేరాయి. పెన్నహోబిలం పరివాహక ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని ఆధికారులు సూచించారు.