విశాఖ గర్జనకు ప్రజానీకం జోరున వర్షాన్ని కూడా లెక్కచేయకుండా విచ్చేస్తారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం నుండి బీచ్ రోడ్డు లోని వైయస్సార్ విగ్రహం వరకు వికేంద్రీ కరణ ఉద్యమంలో భాగంగా విశాఖ గర్జన ర్యాలీలో నగర మేయర్ భారీ జన సమీకరణ తో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లా డుతూ వికేంద్రీకరణ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా పరిపాలనను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి తద్వారా ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని, ఉత్తరాంధ్రను అభివృద్ధిలో నడిపించేందుకు విశాఖను పరిపాల న రాజధానిగా చేయాలని ఉత్తరాంధ్ర ప్రజల ఆశయం మేరకు నేడు లక్ష మందితో విశాఖ గర్జనను ఏర్పాటు చేయడం జరిగిందని, అందు కు జోరున వర్షం పడుతు న్నా ఉత్తరాంధ్ర ప్రజానీకం లెక్కచేయకుండా హాజరయ్యారని, ఇందులో ముఖ్యంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు విద్యాసంస్థలు వ్యాపార సంస్థల ప్రతినిధులు భారీ స్థాయిలో నగర ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు తో పాటు జివిఎంసి ఉద్యోగులు కూడా పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేకంగా నగర మేయర్ కృతజ్ఞతలు తెలియజేశారు.