మహిళల ఆసియా కప్ ఫైనల్లో టిమిండియా ఘన విజయం సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆసియా కప్‌ను ముద్దాడారు. బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో ప్రత్యర్థి శ్రీలంకను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 66 పరుగుల లక్ష్యాన్ని అమ్మాయిలు అలవోకగా చేధించారు. ముఖ్యంగా స్టార్ బ్యాట్స్‌ఉమెన్ స్మృతి మందాన చెలరేగి ఆడింది. కేవలం 25 బంతుల్లో 51 పరుగులు చేసి శెభాష్ అనిపించుకుంది. చెలరేగి ఆడిన మందాన 6 ఫోర్లు, 3 సిక్సర్లతో లంక బౌలర్ల దుమ్ముదులిపింది. దీంతో కేవలం 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. మిగతావారిలో షఫాలీ వర్మ (5), రోడ్రిగేజ్ (2), హర్మాన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీరా, కవిశఆ దిల్హరి చెరో వికెట్ తీశారు.