ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి బైక్‌తో వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి చలానాలు పంపుతారు. బీహార్‌లోని జాముయ్‌లో నలుగురు పోలీసులు ఓవరాక్షన్ చేశారు. హెల్మెట్ లేకుండా స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని పోలీసులు వెంబడించి, వాహనంపై నుంచి లాగి పడేశారు. దీంతో వారు రోడ్డుపై పడిపోయారు. ఈ వీడియోను @IamSuVidha అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేయాలని, లాగిపడేస్తున్నప్పుడు ప్రాణం పోతే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.