ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్లో అల్లరి మూక రెచ్చి పోయింది. కమ్యూనిటీ పోలీసింగ్ అంటూ భార్యాభర్తలపై దారుణంగా దాడి చేశారు. చెంప దెబ్బలు కొడుతూ, కాలితో తన్నుతూ పాశవికంగా ప్రవర్తించారు. భర్త కళ్ల ముందే భార్య జుట్టు పట్టుకుని క్రూరంగా హింసించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.