మావోయిస్టులతో సంబంధం ఉన్నారనే కేసులో ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో 2017లో సెషన్స్ కోర్టు ఆయనతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. దానిని శుక్రవారం బోంబే హైకోర్టు కొట్టివేసి, వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారించిన సుప్రీంకోర్టు ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.