గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,85,530 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 4,43,293 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.