టర్కీలోని ఉత్తర భాగంలో ఓ గనిలో పనులు జరుగుతుంగా మిథేన్ పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో 40 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికిపైగా గాయాలయ్యాయి. గనిలో ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారు. వారంతా క్షేమంగా బయటకు రావాలంటూ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. గతంలో కూడా టర్కీలోని పశ్చిమ భూభాగంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో 310 మంది కార్మికులు చనిపోయారు.