కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుంది. దీంతో తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4. 56 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముంపు గురికాబోయే ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపారు.