విశాఖ గర్జన సభా ప్రాంగణానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి, మంత్రులు బొత్స, విడుదల రజిని, జోగి రమేష్, రోజా, బుగ్గన, కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు చేరుకున్నారు. పోలీసులు బలగాల మధ్య వీరంతా సభా ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వికేంద్రీకరణ కు మద్దతుగా జనం భారీగా తరలి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అని ఆయన చెప్పారు.