T20 వరల్డ్ కప్ 2022 కోసం సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పోటీపడతాయి. గ్రూప్ దశలో నాలుగు జట్లు తలపడాల్సి ఉంటుంది. సూపర్ 12లో మిగిలిన జట్లు ఆడనున్నాయి.ఈ టోర్నీలో ఈ నెల 23న టీమ్ ఇండియా తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ మాదిరిగానే భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ నెల 23వ తేదీ ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు మ్యాచ్ జరగనుంది. దీనికి సన్నాహకంగా.. రెండు వామప్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది రోహిత్ సేనకు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై వామప్ మ్యాచ్‌లను ఆడబోతోంది. ఈ నెల 17, 19 తేదీల్లో ఉదయం 8:30 గంటలకు వామప్ మ్యాచ్‌లు మొదలవుతాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో, మలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ రెండూ బ్రిస్బేన్ స్టేడియంలో షెడ్యూల్ అయ్యాయి.