టీడీపీ ముసుగులో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని మంత్రి విడదల రజినీ విమర్శించారు. గుంటూరు జిల్లాకు చెందిన శాసన సభ్యురాలిగా. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా అని విడదల అన్నారు. కేవలం చంద్రబాబు ఒక వర్గం స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ గర్జనకు వచ్చిన జనాలను చూస్తే. చంద్రబాబు అండ్ కో కు వెన్నులో వణుకు పుడుతుందని దుయ్యబట్టారు.