ఢిల్లీలోని మిరాండా వుమెన్స్ కాలేజీలో ఈ నెల 14న నిర్వహించిన దీపావళి మేళాలో పోకిరీలు రెచ్చిపోయారు. అమ్మాయిల హాస్టల్ గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడ కనపడిన అమ్మాయిలను పట్టుకుని, అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. తమ కోరిక తీర్చాలని విద్యార్థినులను వేధించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. కేసును సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.