మధ్యప్రదేశ్ లో 2 ఏళ్ల బాలుడు తల్లి పై ఫిర్యాదు చేశాడు. బుర్హాన్ పూర్ ఖక్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెడ్తలై గ్రామానికి చెందిన సద్దాంకు 2 సంవత్సరాలు. తన తల్లి కొడుతుందని పీఎస్ కు వెళ్లి ఎస్సై ప్రియాంక నాయక్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఎస్సై తల్లితండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. చిన్నారికి పోలీసు వ్యవస్థ పై ఉన్న గౌరవం చూసి పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. సరిగా మాటలు కూడా రాని బుడతడు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.