మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శుక్రవారం ఆసక్తికర ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలిక కిడ్నాప్ ఘటన తల్లిదండ్రులు, పోలీసులను ఆందోళనలో ముంచెత్తింది. కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని ఛేదించారు. అయితే విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తల్లి తనను చదువు గురించి ప్రశ్నలు అడుగుతోందని, ఆ భయంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు బాలిక పేర్కొంది. ఆమె ఇచ్చిన ఆన్సర్లో పోలీసులు కంగుతిన్నారు.