గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీసుధ కుటుంబ సభ్యులతో వీరాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కు చెల్లించుకున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారికి వెండి తమలపాకులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, దేవాలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.