రేపల్లె పట్టణంలోని 21 మరియు 20వ వార్డులో సోమవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వారి వివరాలను సేకరించి త్వరితగతిన పథకాలను అందించాలని అధికారులను ఆదేశించారు.