వైసీపీ ప్రభుత్వం, నాయకులూ ప్రజల పట్ల అరాచంగా, ఉన్మాదంగా వ్యవహరిస్తోందని, తాలిబన్ల తరహాలో పాలన సాగిస్తోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. టీడీపీ మీడీయా సమన్వయకర్త దారపనేని నరేంద్ర ను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..... రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్టి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేసి వేధిస్తున్నారని, ఏమీ లేని కేసుల్లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రిటైరైన పోలీసు అధికారులను మళ్లీ సిఐడి నియమించికుని వారితో ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక ఉగ్రవాది చెప్పినట్లు సిఐడి అధికారులు చేస్తున్నారని, కోర్టు బెయిల్‌తో బయట తిరుగుతున్న వ్యక్తి ఇలాంటి పనులు చేయిస్తున్నారని విమర్శించారు. తర్వాత కాలంలో అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నా.. బెయిల్ రద్దు అయితే ఆయన వెళ్లి జైల్లో కూర్చుంటారని, అప్పుడు ఇబ్బంది పడేది నేతలు, కార్యకర్తలేనని యరపతినేని హెచ్చరించారు .