దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం 57,752.50 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 491 పాయింట్ల లాభంతో 58,410.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 126.10 పాయింట్లు లాభపడి 17,311.80 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 వద్ద నిలిచింది. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు రాణించాయి.