మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఖోహేఫిజా ప్రాంతానికి చెందిన ఇరు కుటుంబాల వారు తమ పిల్లలకు పెళ్లి చేశారు. జూన్ లో వివాహమైంది. కాగా యువకుడు రాజస్థాన్ బికనీర్ లో ఫైవ్ స్టార్ హోటల్ లో పని చేస్తున్నాడు. దీంతో పెళ్లికాగానే ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. హోటల్ లో బంధించి ఇతరులతో శృంగారంలో పాల్గొనాలని వేధించాడు. ఆమెను కట్టేసి డ్రగ్స్ తీసుకొని ఇతర అమ్మాయిలతో ఆమె ముందే శృంగారంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆమెతో అసహజరీతిలో శృంగారంలో పాల్గొన్నాడు. తప్పించుకున్న బాధితురాలు తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. దీంతో వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.