అనకాపల్లి పట్టణం లో మానసిక ఆరోగ్యం బాగోలేక అనాధలుగా సంచరిస్తున్న వారిని మానసిక చికిత్స చేయించి కుటుంబాలతో కలిపే కార్యక్రమం అయిన 'మనో బంధు" కార్యక్రమం మంగళవారం అనకాపల్లిలో చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు గోల్డ్ వాసు తెలిపారు. ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శశిధర్ మరియు బాషా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 వ తేదీ అనగా మంగళవారం ఉదయం 8 గంటల నుండి అనకాపల్లి పట్టణంలో మతిస్థిమితం లేని వారిని గుర్తించడ౦ జరుగుతుందనిపేర్కొన్నారు. వీరిని పోలీస్ సిబ్బందిసహకారంతో హాస్పిటల్లో చేర్చుటకు అంబులెన్స్ లో విశాఖపట్నం హాస్పిటల్ కుతీసుకువెళ్ళడం జరుగుతుందనితెలియజేశారు. ఇంతకు ముందు పట్టణంలో మొదటి డ్రైవ్ నిర్వహించగా రేపు రెండవ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.