ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి సోమవారం ఎన్ పి కుంట మండలంలోని దనియానిచెరువు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం లో కూడా అమలు కాని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేపట్టారన్నారు. ఇచ్చిన హామీలే కాకుండా 40 రకాల ఇతర హామీలను కూడా ప్రజలకు చెరువ చేశారన్నారు.