అనంతపురం జిల్లా, జూటూరులో టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి, మరియు వైసీపీ వర్గీయులు మధ్య వాగ్వాదం పెరిగి ఇరు వర్గాలు రెచ్చిపోయారు. కత్తులు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి బంధువులు, ఆయన వర్గీయులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు అని వైసీపీ నాయకులూ తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.